Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా శక్తి సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే తోట

మహిళా శక్తి సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ జుక్కల్ నియోజకవర్గం మహిళా శక్తి సంబరాలను ఐకెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఅతిథితిథిగా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మహిళలు బోనాలెత్తి భాజా భజంత్రీలతో జుక్కల్ ఎమ్మెల్యేలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ .. మహిళలందరూ కోటీశ్వరులుగా మారడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కచ్చితంగా ఇల్లు లేని వారు ఇందిరమ్మ గృహ పథకంలో ఇండ్లను నిర్మాణం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించారు.

అదేవిధంగా మండలంలో రూ.3 కోట్ల 76 లక్షల రుణాలు మంజూరైన తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘం వారు ఎవరైనా ముందుకు వస్తే వారికీ పెట్రోల్ పెంపును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మహిళలు సంఘంలో తీసుకున్న డబ్బులు సమయానుకూలంగా చెల్లించి ఉన్న సంఘాలకు బస్సులను కొనేందుకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ ఏడాది వరి కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలు కోటి వరకు లాభాలు పొందారని తెలియజేయడంతో  సభ సంబరం పతాకం స్తాయికి చేరుకుంది . ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యేతో పాటు ఐకెపి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -