నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ భారత సమాజానికి సమానత్వం, విద్య, న్యాయం, హక్కులు వంటి వాటిని అందించి ప్రతీ పౌరుడు స్వేచ్ఛగా జీవించేలా చేసిన మహానుభావులని కొనియాడారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. సామాజిక సమానత్వం, విద్యా ప్రాధాన్యత, పేదల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చూపిన దారిలో నడుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



