నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలోని వజ్రకండి గ్రామంలో ఒక కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో విద్యుత్తు సమస్యలు లో వోల్టేజి సమస్యలు తలెత్తకుండా మండలంలో వజ్రకండి గ్రామంలో సబ్స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేసి, ప్రారంభించామని తెలిపారు.
అభివృద్ధి పనులలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదని, ఇవేకాక గ్రామాలలో సిసి రోడ్లు మురికి కాలువల నిర్మాణాలకు ఇప్పటికే నిధులు కేటాయించి పనులను పూర్తి చేశామని అన్నారు. ఇంకా ఏవైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా పూర్తిచేసి నిధులు కేటాయించి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామదాసు పటేల్, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, జుక్కల్ ట్రాన్స్కో ఈ మోహన్ , గ్రామస్తులు జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మండల యూత్ పార్టీ అధ్యక్షుడు సతీష్ పటేల్ , మనోహర్ పటేల్ , రమేష్ దేశాయ్ , తదితరులు పాల్గొన్నారు.