నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఎన్ ఆర్ ఈజీఎస్ నిధుల ద్వారా రూ. 8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ ఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్ పాండు రంగారెడ్డి తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రూ.8 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



