నవతెలంగాణ – కంఠేశ్వర్
బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జనవరి 10 తేదీన నిర్వహించే సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రి బాయి పూలే పేరిట అవార్డు ను స్థాపించి మహిళా ఉద్యోగ ఉపాధ్యాయినులను 10 సంవత్సరాలుగా అవార్డ్ ను ఇవ్వడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం గా చేర్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, కోశాధికారి డి రాజు, సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.



