నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఇస్సన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల వాల్పోస్టర్ను శనివారం స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం వివరించారు. బ్రహ్మోత్సవాలు 11 నవంబర్ నా గణపతి పూజతో ప్రారంభమై ప్రతిరోజు వివిధ పూజలు అందుకొని, నవంబర్ 13 నా దక్షయజ్ఞం (అగ్నిగుండంల) తో ఉత్సవాలు మోగియునని, ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, సిబ్బంది నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
కాలభైరవుడి ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



