Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లబ్దిదారులకు ఎల్ఓసిలు అందజేసిన ఎమ్మెల్యే వేముల

లబ్దిదారులకు ఎల్ఓసిలు అందజేసిన ఎమ్మెల్యే వేముల

- Advertisement -

– ముగ్గురు లబ్ధిదారులకు రూ.7లక్షల 20వేల  ఎల్ఓసిలు అందజేత 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
బాల్కొండ నియోజకవర్గం చెందిన పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వము నుండి మంజూరు చేయించిన ఎల్ఓసి పత్రాలను రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాదులోని తన స్వగృహంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.7లక్షల 20వేల విలువైన ఎల్ఓసి మంజూరు పత్రాలను ఆయన అందించారు. కమ్మర్ పల్లి మండలంలోని  బషీరాబాద్ గ్రామానికి చెందిన గుండెబోయిన శ్రీకాంత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

ఆయన వైద్య చికిత్స కోసం రూ.2లక్షల విలువ గల ఎల్ వో సి మంజూరు పత్రాన్ని అందించారు. అదేవిధంగా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కోసం రూ.2లక్షల 80వేల ఎల్ ఓ సి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. మహమ్మద్ పాషాకు కిడ్నీ డోనర్‌గా ఉన్న తండ్రి మహమ్మద్ ఖాజా వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల 40వేల విలువ గల ఎల్ ఓ సి మంజూరు పత్రాన్ని  బాధితులకు అందజేశారు. తమ వైద్య ఖర్చులకోసం ప్రభుత్వం నుండి ఎల్ఓసి లను మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -