- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే ఆలయం వద్ద రెండు గదులను మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఆలయ కమిటి అధ్యక్షులు ద్యాగ నర్సారెడ్డి, ఉపాధ్యక్షులు ఎంబరి ఆనంద్, స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి , ఔట్ల సాయన్న, చిట్టీ భూమన్న, కత్తి భోజన్న, ప్యాట్ల పెద్ద గంగారాం, అనిల్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



