Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
ఇటీవల కాలంలో వివిధ అనారోగ్య కారణాల తో మృత్యువాత పడిన మృతుల కుటుంబాలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని జంగమయ్యపల్లి, ముందరి తండా, అల్వాల గ్రామంలోని పలువురు మృతుల కుటుంబ సభ్యులను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ముందుగా జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన శకుంతల ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన చెన్నమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను సైతం ఎమ్మెల్యే పరామర్శించి చెన్నమ్మ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం  అదే గ్రామానికి చెందిన మాసమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముందరితాండ గ్రామానికి చెందిన గోపాల్ ,సాలమ్మల కూతురు జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జ్యోతి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్వాల గ్రామానికి చెందిన షకీల్ పాషా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, బాలరాజు, మల్లేష్, నరసింహ, యాదగిరి, సురేందర్ గౌడ్, వేణు గౌడ్ మన్యం బుచ్చన్న, శంకర్ నాయక్, అల్వాల గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి తోపాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -