- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శనివారం అంకాపూర్ లో తన సహాయకుడు శంకర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. పట్టణంలో గుడ్ల బాబా ఇటీవల చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాలు అయినటువంటి ఫతేపూర్, మంథని, ఆలూరు మిర్ధపల్లి, అమ్రాద్,మదన్ పల్లి గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగోట్ గంగాధర్, చింత ప్రవీణ్, మామిడి పల్లి రాజేందర్ రెడ్డి, మామిడిపల్లి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -