నవతెలంగాణ – వనపర్తి
వాల్మీకి సంఘం మాజీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త సింగోటం నాయుడు కుటుంబాన్ని శనివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సింగోటం నాయుడు మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ గా పనిచేసేవాడని, కుటుంబానికి ఆదెరువుగా ఉన్న పెద్దదిక్కు మృతి చెందడంతో కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న తాను సహాయ సహకారాలు అందజేస్తారని వారికి భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ హైదరాబాద్ ముఖ్య కార్యనిర్వాహకుడు కె బి నాయుడు, వనపర్తి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, స్థానిక మాజీ కౌన్సిలర్ భువనేశ్వరి శ్యామ్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం చారి, వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్, దేవన్ననాయుడు, మైనార్టీ నాయకులు లతీఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సింగోటం నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES