- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
అనారోగ్యంతో మరణించిన మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డుకు చెందిన బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు చింతకింది పర్శరాములు కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పర్శరాములు పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంట తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అధికం బాలకిషన్ గౌడ్, ఎమ్మ యాదగిరి, తిరుపతి రెడ్డి పలువురున్నారు.
- Advertisement -



