Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల మేలుకోరే ఎమ్మెల్యే..

రైతుల మేలుకోరే ఎమ్మెల్యే..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

ప్రతిక్షణం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు రైతుల కొరకు ఆరాటమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే 24 గంటలు రైతుల కొరకే ఆలోచిస్తారని పోచారం ప్రాజెక్టులో 16 అడుగుల నీరు రాగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం జరిగిందని అన్నారు. గత నెల 31వ తేదీన నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్లు మన తెలిపారు.

ప్రిన్సిపల్ సెక్రెటరీ నుండి అనుమతులు రానందున ఐదు రోజులపాటు ఆలస్యమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 అడుగుల నీరు ఉండడంతో ఢిల్లీ పర్యటలో ఉన్న ఎమ్మెల్యే తనకు రావడానికి ఆలస్యం కావడం జరుగుతుందని రైతులు ఇబ్బంది పడతారని ఆలోచనతోటి అధికారులు నాయకులతో నీటిని విడుదల చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోనే నాగిరెడ్డిపేట మండలాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో వేర్ హౌస్ ఏర్పాటుకు 40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుండి ప్రతి విషయంలో పద్ధతి ప్రకారంగా పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గత ఎన్నడు లేని విధంగా సంవత్సరం నర కాలంలోనే ఎల్లారెడ్డిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి,  ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, మైనార్టీ అధ్యక్షుడు ఇమామ్, సురేందర్ గౌడ్, శ్రీరామ్ గౌడ్, రవీందర్ రెడ్డి, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -