Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే కోట లక్ష్మీ కాంతారావు పాల్గొని, ప్రారంభించినారు. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా స్థిరమైన నివాసం కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని,ప్రతీ అర్హత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్ర , ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,  మాజీ జెడ్పిటిసి సాయి గౌడ్, మాజీ సర్పంచ్ బొంపెలి రాములు, మండల కాంగ్రెస్ యువజన నాయకుడు సతీష్  పటేల్ , ఇందిరమ్మ గృహప్రవేశ లబ్ధిదారినీ రాజమణి బాలయ్య,  స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -