- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కౌలాస్ గ్రామానికి చెందిన రాజు కుటింబికుల అనూప్ కుమార్ సింగ్ కుమారుడు అన్షుల్ సింగ్ వివాహం వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుక హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, సతీమణి తోట అర్చన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు..
ఈ వివాహ వేడుకలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , కౌలాస్ రాణి అనితా సింగ్, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు కూడా పాల్గొన్నారు.
- Advertisement -



