నవతెలంగాణ-తుంగతుర్తి
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీటీసీ రేగటి రవి జన్మదినం సందర్భంగా గురువారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, రవికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయాలలో ఉన్నత పదవులు సాధిస్తూ, భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
అనంతరం రవి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి,స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, పచ్చిపాల వెంకన్న, తుంగతుర్తి సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్, కందుకూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



