తీవ్రంగా ఖండించిన ఆర్టీఐ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
జర్నలిస్టులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని,ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఆర్టీఐ (యునైటెడ్ పర్ ఫోరమ్) జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తక్షణమే జర్నలిస్టుకు బహిర్గతమైన క్షమాపణ చెప్పి, మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు రాజకీయ నాయకులకంటే, అధికారులకంటే భిన్నంగా ఎటువంటి ఆశ, ఆశయాలు, వేతనాలు లేకుండా ప్రజల సమస్యలను అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, వాటి పరిస్కానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు.
జర్నలిస్టులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరికాదు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES