ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
సరిహద్దులు దాటుతున్న యూరియా
నీరుగారుతున్న లక్ష్యం
నవతెలంగాణ – పరకాల
యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు గ్రహించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, ప్రైవేట్ ఫర్టిలైజర్స్ ఆండ్ పెస్టిసైడ్స్ డీలర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించన విషయం తెలిసిందే. ఈ సమీక్ష సమావేశంలో యూరియా నియోజకవర్గం దాటి బయటికి పోకుండా కట్టుదితమైన చర్యలు తీసుకోవాలని, పరకాల నడికూడ మండలాల రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యంకాగా వ్యవసాయ శాఖ అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంది.
ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి 24 గంటలు కూడా దాటకుండానే ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ పరకాల మండలం నాగారం ఏఈఓ కాటం రాజకుమార్ కమలాపురం మండలానికి చెందిన తన బంధువుకి 10 యూరియా బస్తాలను ఇప్పించడం జరిగింది. ఇది గుర్తించిన కొంతమంది రైతులు యూరియా అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని వెంబడించగా నడికుడ మండలం వద్ద పట్టుబడినట్లు రైతులు వెల్లడించారు.
దీంతో వ్యవసాయ శాఖ అధికారుల తీరు మండలంలో చర్చ నియాంశంగా మారింది.సొంత మండలాలకు చెందిన రైతులు రోజుల తరబడి క్యూలైన్లో వేచి చూసిన ఒకటికి మించి ఇవ్వని అధికారులు పక్క మండలానికి చెందిన వ్యక్తికి ఏకంగా పది బస్తాలు కట్టబెట్టడం ఏంటని విమర్శిస్తున్నారు. గత సమీక్ష సమావేశంలోనే ఇంచార్జి ఏ డి ఎస్ శ్రీనివాసుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈ ఘటనతో ఎలా స్పందిస్తారనేది పలురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు తీరు మార్చుకొని మండలంలోని రైతులకు సంపూర్ణంగా యూరియా అందేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
యూరియా పంపిణీలో ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES