నవతెలంగాణ – అశ్వారావుపేట: మండలంలోని రెడ్డిగూడెం పంచాయతీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. తాగునీటి సరఫరా చేసే బోరు బావి మోటార్ మరమ్మత్తులకు గురి కావడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని, నీటి కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉమ్మల లచ్చి రెడ్డి,గ్రామ శాఖ అద్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డిలు ఇటీవల ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మోటార్ ఇప్పించి, సమస్య పరిష్కరించారు. ఈ మోటార్ ను ఆదివారం గ్రామస్తులు బోరు బావిలో అమర్చారు. తమకు తాగునీటి కష్టాలు తొలగించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల కాంతారావు, ఉమ్మల జాపిన్ రెడ్డి, ఉమ్మల ధాసిరెడ్డి, ఉమ్మల వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడికి ఎమ్మెల్యే జారే పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES