సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాధవి దంపతుల 32వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఆదివాసి సాంప్రదాయాలలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. బుధవారం వివాహ వార్షికోత్సవ దినోత్సవం ఉండగా విశాఖ ప్రాంతంలోని అత్యంత గిరిజన ప్రాంతమైన అరకు గిరిజన ఆదివాసి గూడెంలో వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బి ఎల్ అర్ దంపతులు తమ గూడెం కు రావడంతో గూడెం వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ సాధారణంగా స్వాగతం పలికారు. ఆదివాసి దుస్తులను ధరించి ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ వేడుకల దృశ్యాలను వీడియో తీయగా అ వీడియో ను ఎమ్మెల్యే అనుచరులు గురువారం మిర్యాలగూడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. గిరిజన ప్రాంత ఆదివాస సాంప్రదాయ ప్రకారం సాదరణ వ్యక్తిగా వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం పట్ల నియోజవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ సంప్రదాయంలో ఎమ్మెల్యే వివాహ వార్షికోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES