Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం.. కొత్త ఆఫీస్ ప్రారంభం

ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం.. కొత్త ఆఫీస్ ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత.. కేసీఆర్‌కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా.. తాజాగా చిట్ చాట్‌లో చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాని ప్రారంభించ‌నుంది.
ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు బంజారాహిల్స్ లో కవిత నివాసం పక్కన ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవం పూజ చేయ‌నున్నారు. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు.
పూజ అనంతరం ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి తరఫున కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాపై కొత్త కార్యాలయంలో మాట్లాడ‌నున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad