నవతెలంగాణ – పెద్దవూర
హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు శుక్రవారం నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గంపెద్దవూర మండలం, బసిరెడ్డి పల్లి గ్రామానికి చెందినతుడం సునీత నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక నాయకులు ఎమ్మెల్సీ దృషికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2 లక్షల 50 వేల చెక్కును మంజూరు చేయించి, బాధితురాలి కుటుంబ సభ్యులకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఎల్సీ మంకెన కోటిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ ఓసీ చెక్కును మంజూరు చేయించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి కుటుంబ సభ్యుల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ తుడుం అంజయ్య, రవి, తదితరులు ఉన్నారు.
ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



