Monday, December 29, 2025
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా ఎంఎల్ సీ శంకర్ నాయక్

రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా ఎంఎల్ సీ శంకర్ నాయక్

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా ఎంఎల్సి శంకర్ నాయక్ కు నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వైస్ చైర్మ పర్శన్స్ గా పూనమ్ చంద్రకళ,విశ్లవత్ లింగం నాయక్,సెడ్ మాకి ఆనంద్ రావ్,కురకుల మల్లిఖార్జున్ లను నియమించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎంఎల్సి శంకర్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. గిరిజనుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని,గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -