నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మోడల్ స్కూల్ దేవరకొండలో పనిచేస్తున్న గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజుగౌడ్ రచించిన మ్యాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ గణిత పరిక్రియలు, భావనలు, సూత్రాలను సులభ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉపయోగపడేలా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం భావనలు ప్రతి విద్యార్థికీ అర్థమయ్యేలా గణితాన్ని సులభతరం చేసేలా రాశారని చెప్పారు. విద్యార్థులకు గణితం పట్ల భయాన్ని తొలగించేలా రూపొందించారని అన్నారు. ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం (పీఎంటీఏటీఎస్) అధ్యక్షుడు తరాల జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడేలా ఆలోచించి గణితం పుస్తకాన్ని రాశారని అన్నారు. పుస్తక రచయిత నాగరాజును వారు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, అసోసియట్ అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పీఎంటీఏటీఎస్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీమ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘మ్యాథ్స్ ఫర్ ఆల్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES