Tuesday, March 31, 2026
E-PAPER
Homeఖమ్మంసీఐఈఆర్ ద్వారా బాధితుడికి చరవాణి అందజేత

సీఐఈఆర్ ద్వారా బాధితుడికి చరవాణి అందజేత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ ను సీఐఈఆర్ పోర్టల్ సహాయంతో గుర్తించి ఫిర్యాదుదారుడికి అందజేసిన ఘటన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చల్లా సత్యనారాయణ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ అఖిల సాంకేతిక పరిజ్ఞానమైన సీఐఈఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్‌ ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ ను మంగళవారం అసలు యజమాని చల్లా సత్యనారాయణకు అందజేశారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు పోలీసుల సేవలను అభినందిస్తూ ఎస్ఐ అఖిల కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు వెంటనే సీఐఈఆర్ పోర్టల్‌ లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -