– ఈవీలను భారీగా ప్రొత్సహిస్తున్నాం
– ఈ ఏడాదినాటికి రాయితీలు అమలుచేస్తాం : నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్రారంభంలో మంత్రి పొన్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్థిక, సామాజికాభివృద్ధికి చలనశీలత చాలా కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు, పౌరులు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపార అవకాశాలను పొందడంలో సహాయపడతాయని వ్యాఖ్యానించారు. నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నక్రమంలో సురక్షితమైన, సరసమైన , స్థిరమైన చలనశీలత వ్యవస్థలను నిర్మించడం అవసరమని అభిప్రాయప డ్డారు. మంగళవారం నోవొటెల్‌లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ -2026 కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, కమిషనర్ ఇలాంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ,భాగ్యనగర్ గ్యాస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రాజు , మధు, రామకష్ణ,సూరజ్, ఎలేట్స్ టెక్నోమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ 2026లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ మొబిలిటీ సమ్మిట్‌ను నిర్వహించినందుకు రవాణా శాఖ, ఎలెట్స్ టెక్నోమీడియాను అభినందిస్తున్నట్టు చెప్పారు. భారతదేశంలో చలనశీలత భవిష్యత్తును రూపొందించడానికి ఇలాంటి వేదికలు ప్రభుత్వం, పరిశ్రమ ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి ఉపయోగపడతాయని వివరించారు. తెలంగాణ చలనశీలత దష్టి ఆధునిక, సమర్థవంతమైన , స్థిరంగా ఉండేలా, పర్యావరణాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. 2026 చివరినాటికి విద్యుత్ వాహనాలకు 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఎటువంటి పరిమితి లేకుండా మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ వాహనాల కొనుగోలుదారుల కు దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన ప్రయోజనా లను అందించామని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకా లు ఆయా వాహన విభాగాలలో విద్యుత్ వాహనాల కొనుగోళ్లను వేగవంతం చేయడంలో సహాయపడా ్డయని వివరించారు. తెలంగాణలో 20 వేల కొత్త విద్యుత్ మూడు చక్రాల ఆటోరిక్షాల పర్మిట్లను అనుమతించిందన్నారు. ప్రభుత్వం 10 వేల కొత్త సీఎన్‌జీ త్రీ-వీలర్ పర్మిట్లను , 10 వేల కొత్త ఎల్పీజీ త్రీ-వీలర్ పర్మిట్లను కూడా ఇచ్చినట్టు వివరించారు. అదనంగా ఇప్పటికే ఉన్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి 20 వేల పర్మిట్లు అనుమతించబడ్డాయని వివరించారు. ప్రజా రవాణా విద్యుదీకరణ తెలంగాణకు మరో ముఖ్యమైన ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. 2026 ప్రారంభం నాటికి, హైదరాబాద్ ప్రాంతానికి సేవలందిస్తున్న 325 కిలోమీటర్లకుపైగా బస్సులతో సహా దాదాపు 810 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయని చెప్పారు. 2027 నాటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో దాదాపు 2,800 ఎలక్ట్రిక్ బస్సులను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజారవాణాలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడంపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. ఇది ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందనీ, పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. టెక్నాలజీ , ఇన్నోవేషన్ చలనశీలత భవిష్యత్తును రూపొందించడంలో సాంకేతికత, ఆవిష్కరణలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించారు. బ్యాటరీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, తెలివైన రవాణా వ్యవస్థలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పురోగతి మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను మారుస్తుందన్నారు. స్టార్టప్‌లు, పరిశ్రమల యాజమాన్యాలు, పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కోసం స్థిరమైన మొబిలిటీకి పరివర్తనకు ప్రభుత్వం, పరిశ్రమ, స్టార్టప్‌లు, విద్యాసంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని చెప్పారు. ఈ సమ్మిట్ గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఆర్థిక, సామాజికాభివృద్ధికి చలనశీలత కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



