Wednesday, May 7, 2025
Homeజాతీయం1971లో మాక్‌ డ్రిల్స్‌ ఇలా..!

1971లో మాక్‌ డ్రిల్స్‌ ఇలా..!

- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో నేడు మాక్‌ డ్రిల్స్‌ జరగనున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టడం గమనార్హం. కార్గిల్‌ యుద్ధం అప్పుడు జరిగినా.. అవి సరిహద్దు జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.
1971లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. 1971లో మాక్‌ డ్రిల్స్‌ అనుభవాన్ని సీనియర్‌ జర్నలిస్టు మధురేంద్ర ప్రసాద్‌ సిన్హా ఓ మీడియా సంస్థతో పంచుకొన్నారు. యుద్ధానికి సరిగ్గా రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఈ డ్రిల్స్‌ మొదలుపెట్టారని.. తూర్పు పాకిస్తాన్‌లో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎఎకె నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారన్నారు. నాడు రాత్రి 6:30 కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకొనేవారన్నారు. సైరన్‌ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి.. ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కొనేవారమని పేర్కొన్నారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా చేసేవారు కాదు. ఆర్కే శర్మ అనే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలు చెబుతూ.. నాడు సైరన్‌ వినిపించగానే నేలపై పడుకొని.. చెవులు గట్టిగా మూసుకొనేవారమన్నారు.
ప్రతిదీ కీలకమే..
1971 యుద్ధ సమయంలో తాజ్‌మహల్‌ను కూడా కేమోఫ్లాజ్‌ వస్త్రంతో కప్పిపెట్టారు. నాడు ఆగ్రాలోని ఖేరియా ఎయిర్‌ బేస్‌ కూడా పాక్‌ లక్ష్యాల్లో ఒకటి. ఆ దేశ విమానాలు డిసెంబర్‌ 3న అక్కడ బాంబులు జారవిడిచాయి. దీనిలో ఎయిర్‌ బేస్‌ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్‌మహల్‌పై పాక్‌ దాడి చేయొచ్చని భావించారు. దీంతో ఆ మర్నాడే దానిని శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయేలా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జూట్‌ వస్త్రంతో కప్పిపెట్టారంట.. ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్‌మినార్‌, జైసల్మేర్‌ కోట వద్ద కూడా తీసుకొన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్‌ వారు జర్మనీ, జపాన్‌ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పరంజాను ఏర్పాటు చేశారు.

  1. గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు.
    2. వాయుసేనతో హాట్‌లైన్‌, రేడియో కమ్యూనికేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు.
    3. కంట్రోల్‌ రూమ్‌లు, షాడో కంట్రోల్‌ రూమ్‌ల పనితీరును పరీక్షించేందుకు.
  2. పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు.
    5. బ్లాకౌట్‌ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం. వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం.
  3. సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులను యాక్టివేట్‌ చేయడం, వాటి స్పందనను పరీక్షించడం. వీటిల్లో వార్డెన్‌ సర్వీసులు, అగ్నిమాపక, సహాయక, తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి.
    7. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవడానికి నిర్వహిస్తారు. ఈ వ్యవస్థలు మొత్తాన్ని యాక్టివేట్‌ చేస్తారు.
    8. నేటి డ్రిల్స్‌లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక ఔట్‌పోస్టులను విద్యుత్తు స్టేషన్లు, కమ్యూనికేషన్‌ హబ్స్‌ కేమోఫ్లాజ్‌ చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు,
    9. ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు.
    10. ఇలాంటి మాక్‌ డ్రిల్స్‌ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి.
    2025 మార్చిలో తైవాన్‌లో నిర్వహించారు. ఇక జపాన్‌లో 2023 నవంబర్‌లో జరిగాయి. ఫిన్లాండ్‌లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు.
    అసలు వీటిని ఎందుకు నిర్వహిస్తారు..?
    ఇప్పటికే ఈ మాక్‌ డ్రిల్స్‌లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్‌, ఎన్‌సిసి కోర్‌ను, ఎన్‌ఎస్‌ఎస్‌, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌, కాలేజ్‌లు, స్కూల్‌ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్‌ అత్యంత కీలకమైంది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -