నవతెలంగాణ – సదాశివనగర్
బాలల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్ యందు శుక్రవారం మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలుగా విడిపోయి దేశ సమస్యలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయంలో పెట్రోల్ ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో తెలపాలన్నారు. కోవిడ్ తర్వాత విద్యావ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ప్రభుత్వం ఏ విధంగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుందో ప్రజలకు వివరించాలన్నారు. రైతులకు కల్పించే మద్దతు ధరపై స్వల్ప కాలిక చర్చ చేయడం జరిగింది. పార్లమెంటరీ రూల్స్ బంగం కలిగించే సభ్యులకు మార్షల్ ద్వారా పార్లమెంటు నుంచి బయటకు పంపించి వేయడం వంటి సన్నివేశాలను కన్నులకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో మాక్ పార్లమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



