నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో ఉండగా..ఇండియా బ్లాక్ కూటమి తరుపున తెలంగాణ వాసి బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష కూటములు ఉపరాష్ట్రపతి పోలింగ్‌కు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వర్క్‌షాప్ కొనసాగనుంది. దీంతో ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీలందరూ మాక్ పోలింగ్ లో పాల్గొనున్నారు. రేపు ఇండియా బ్లాక్ కూటమి ఎంపీలకు మాక్ పోల్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాక్ పోల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES