Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ హైస్కూల్‌లో మాక్ పోలింగ్

ఆదర్శ హైస్కూల్‌లో మాక్ పోలింగ్

- Advertisement -

ఓటు హక్కుపై గ్రామంలో విద్యార్థుల అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – కాటారం

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడంతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మండలకేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ లో సోమవారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే అభ్యర్థులు, పోలింగ్ అధికారులు, సిబ్బంది పాత్రలు పోషిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ, ఓటింగ్ గదులు వంటి అంశాలను ప్రదర్శించి ఓటింగ్ విధానాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించారు. మాక్ పోలింగ్‌కు ముందుగా విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్రామ పురవీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రానున్న 17న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో, ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో స్పష్టంగా అవగాహన పొందుతారని అన్నారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ జనగామ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -