Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరుగు పందెం పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థి..

పరుగు పందెం పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ల్లోఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అజ్మీర భవాని ప్రసాద్ అనే విద్యార్థి ఈనెల 3,4 తేదీలలో జేఎన్ఎస్ హన్మకొండలో జరగబోయే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు శుక్రవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత నెల 29వ తారీఖున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని  అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎన్నికయ్యాడని తెలిపారు. ఎంపికైన క్రీడాకారున్ని కళాశాల ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు,ఉపాధ్యాయులు సతీష్ రమేష్, నాగేశ్వరరావు, సారయ్య, మధుబాబు, కిరణ్, తాజుద్దీన్, రాజేందర్, దేవేందర్, రాజేందర్, ప్రదీప్, విజయలక్ష్మి, లలిత, శైలజ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -