నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కొడారి ఓంకార్ 8వ తరగతి, జల్లారపు అక్షయ 7వ తరగతి విద్యార్థులు ఈనెల 1న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు ఈనెల 6వ తేదీన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హన్మకొండలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్స్ పాల్ తోపాటు ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు,ఉపాధ్యాయులు,క్రీడాకారులు అభినందించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES