Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోడల్‌ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలి

మోడల్‌ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలి

- Advertisement -

– వేం నరేందర్‌ రెడ్డికి పీఎంటీఏ టీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని పీఎంటీఏ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్‌, ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిని కలిసి మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఫైల్‌ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరారు. అదేవిధంగా అన్ని శాఖల్లో క్లియర్‌ అయ్యి ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్న మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నోషనల్‌ సర్విస్‌ ఫైల్‌ వెంటనే క్లియర్‌ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై వేం నరేందర్‌ రెడ్డి సీఎంఓ అధికారులతో మాట్లాడి నోషనల్‌ సర్విస్‌ ఫైల్‌ ఆర్డర్‌లో పెట్టాలని ఆదేశించారు. నోషనల్‌ సర్వీస్‌ ఫైల్‌ సీఎం అప్రూవల్‌ అవుతుందని భరోసానిచ్చారు. అదేవిధంగా 010 ఫైల్‌ పై చర్చించడం కోసం ముఖ్యమంత్రితో ప్రత్యేక సమయం ఇప్పిస్తాననీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వేం నరేందర్‌ రెడ్డిని కలిసినవారిలో పీఆర్టీయు ఆడిట్‌ కమిటీ చైర్మెన్‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -