నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి మాడ్రన్స్ కబడ్డీ క్రీడోత్సవాలు విజయవంతంగా జరిగాయని మోడ్రన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పసుల లక్ష్మణ్,జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కల రాజబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీడోత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ పూర్ణచంద్రరావు ముఖ్య ఆదితులుగా హాజరై మాట్లాడారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడలల్లో రాణించాలన్నారు.
భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.ఈ పోటీలలో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ క్రీడాకారులు ఈనెల 26 నుండి ఖమ్మంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ముల్కల ప్రవీణ్ కుమార్,లౌడియా సారయ్య,పసుల రామ్,అజయ్ కుమార్ మంతెన,నగేష్,జనగాం సతీష్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు,క్రీడాకారులు పాల్గొన్నారు.



