– రూ.40 లక్షల విలువగల వైద్య పరికరాలను ప్రారంభించిన డైరెక్టర్ బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిమ్స్‌లో ఇకనుంచి ఆధునిక ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రూ.40 లక్షల విలువ గల మూడు ఆధునిక వైద్య పరికరాలను డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప బుధవారం ప్రారంభించారు. అనంతరం బీరప్ప మాట్లాడుతూ రోగుల చికిత్స, పునరావాస సేవలను మరింత మెరుగు పర్చేందుకు ఈ పరికరాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. డైనామోమెట్రీ (ఫోర్స్ మెజర్‌మెంట్ సిస్టమ్) వల్ల కండరాల బలం, కీళ్ల కదలిక, సంతులనం అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. న్యూరో మస్క్యులోస్కెలిటల్ సమస్యలు, శస్త్రచికిత్స తర్వాత పునరుద్ధరణ, వృద్ధుల్లో పతన నిరోధంలో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఫుట్ ప్రెజర్ అనాలిసిస్ సిస్టమ్ ద్వారా నడక, భంగిమ, పాదపదన వ్యత్యాసాలను అంచనా వేయడానికి వీలవుతుందని వెల్లడించారు. ఇది డయాబెటిక్ ఫుట్‌కేర్, ఆర్థోపెడిక్, న్యూరాలజికల్ రిహాబిలిటేషన్‌లో ఉపయోగిస్తామన్నారు. షార్ట్‌వేవ్ డయాథెర్మీ ద్వారా లోతైన కణజాల చికిత్స, నొప్పి ఉపశమనం, వాపు తగ్గించడంలో ఉపయోగించ నున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ఖరీదైన, అధునాతన వైద్య పరికరాలు రాష్ట్రంలో నిమ్స్ లోనే మొదిటిసారి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మి భాస్కర్, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ సత్యగౌడ్, ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ప్రవీణ్, డా.సునీత్ వాగ్రే ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు.
నిమ్స్‌లో ఆధునిక ఫిజియోథెరపీ సేవలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES