Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రాచీన వైద్యం ఆధారంగానే ఆధునిక చికిత్స

ప్రాచీన వైద్యం ఆధారంగానే ఆధునిక చికిత్స

- Advertisement -

– ఫార్మా కంపెనీలతో చెరువులు చెలకలు విషమయం
– యువత ప్రశ్నించేతత్వాన్ని అలవరుచుకోవాలి
– జనరిక్‌ మందులపై అవగాహన కల్పించాలి
– మనం బతకాలి… ఇతరులను బతకనివ్వాలి
– ఆరోగ్య రంగంలో సేల్స్‌ రిప్రజెంటిటీవ్‌ కృషి భేష్‌ : మహాసభలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి

భారత్‌లో ప్రాచీన వైద్యం పతంజలి, ఆయుర్వేదం, చిల్ల, ఉసిరి గింజల ద్వారా చేసిన మందులు ప్రజల ఆరోగ్యాలకు బాగా ఉపయోగపడేవని వాటి ఆదారంగానే నేడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌జిల్లా కేంద్రంలో శివం కన్వెన్షన్‌లో తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటిటీవ్‌ యూనియన్‌ రాష్ట్ర 6వ మహాసభలు డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమ య్యాయి. ఈసందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. మనం బతకాలి ఇతరులను బతకనివ్వాలని సూచించారు. భారతదేశంలో బౌద్ధం తర్వాత వచ్చిన మార్పుల వల్ల వైద్యం కొత్త పుంతలు తొక్కిందని అన్నారు. ఎలుకలు, కోతులపై ప్రయోగాలు చేసి మందులు కనిపెడుతున్నారని తెలిపారు. మెడికల్‌ విభాగంలో జరుగుతున్న మాఫియాను తట్టుకుంటూ రిప్రజెంటిటీవ్‌గా పనిచేయడం అభినందించే విషయమన్నారు. ప్రాణాలను నిలబెట్టే మందుల విషయంలో కేంద్రం విధించిన జీఎస్‌టీ అమలు చేయద్దంటూ మీరు చేస్తున్న ఉద్యమాలు శుభ పరిణామన్నారు. రూ.15 వేలలోపు వేతనాలు తీసుకుంటూ జీవనం గడుపుతున్న ఈరంగంలో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచాలని కోరారు. అంతు చిక్కని వ్యాధులకు అందు బాటులో మందులు ఉన్నా…ఇంకా అనవసరమైన ముందులు వివిధ కంపెనీలు అమ్ముతున్నాయని వీటిని వెంటనే నిషేధించాలని డిమాండ్‌ చేశారు. గడ్డిమందు ఎనాడో నిషేధించారని వాటిని యధేచ్చగా వెటర్నరీ షాపుల్లో అమ్మడం దారుణమన్నారు. ఫార్మా కంపెనీలు భారత్‌లాగా అమెరికాలో విచ్చలవిడిగా ఉండవని పట్టణానికి దూరంగా ఉన్నా..కాలుష్య నివారణ కోసం జాగ్రతలు తీసుకుంటారని గుర్తు చేశారు. జనవాసాల మద్య ఫార్మాకంపెనీలు ఉంటే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆదేన వ్యక్తం చేశారు. నెలలు నిండని కోడిపిల్లను ఆరునెలల వయసున్న దానిలాగా పెంచే మందులు రావడం చేత ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. పర్యావరణ కాలుష్యం వల్ల మనిషి జీవించ లేని స్థితి నెలకొందన్నారు. చెరువులు, చెలకలు, చివరికి ఆహారపంట పొలాల్లో కూడా విషం చిమ్మేవిధంగా ఫార్మాకంపెనీలు, రసాయనిక ముందుల విషం చిమ్ముతున్నాయన్నారు. అమెరకా యుద్ద కాంక్ష ప్రపంచ దేశాలను వణికిస్తోందన్నారు. క్లబ్‌లు, పబ్‌ల నుంచి యువత బయటకు వచ్చి ప్రశ్నించేతత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు.

అధ్యక్షత వహించిన డాక్టర్‌ మధుసుధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆశాలు, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత,వేతన పెంపు విషయంలో సీఐటీయూ చేసిన పోరాటాలు చారిత్రాత్మకమన్నారు. అదే చైతన్యంతో హక్కుల కోసం నిలబడాలని సూచించారు. సమాజ మార్పుకోసం కృషి చేయాల్సిన అవసరముందన్నారు. కార్మికులకు హక్కులు లేకుండా కర్షకులను పొలం నుంచి గెంటేసే గ్లోబల్‌ కుట్ర జరుగుతుందని నియంతలా హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ప్రతి ఒకరు పోరాటాలకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు శ్రీధర్‌, భానుకిరణ్‌, శోభన్‌యాదవ్‌, రామ్మోహన్‌రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఫసియోద్దీన్‌, కడియాల మోహన్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -