- Advertisement -
వడోదర : ప్రధాని నరేంద్ర మోడీ, హిందూత్వవాది వీడీ సావర్కర్ రచనలు గుజరాత్‌లోని మహారాజా సాయాజిరావ్ యూనివర్సిటీ (ఎంఎస్‌యూ) పాఠ్యపుస్తకాలలో దర్శనమిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా బీఏ (ఆంగ్లం) మైనర్ కోర్సులో వీటిని చేర్చారు. మోడీ రచించిన జ్యోతిపుంజ్, సావర్కర్ రాసిన ఇన్‌సైడ్ ది ఎనిమీ క్యాంప్ లను ఎంఎస్‌యూలోని ఆంగ్ల విభాగం పాఠ్యాంశాలలో చేర్చింది. భారత్‌పై కాల్పనికం కాని రచనల విశ్లేషణ, అవగాహన పేరిట ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న కోర్సులో వీటిని చేర్చారు. ఎంపిక చేసిన శ్రీ అరబిందో, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రచనలు, స్వామి వివేకానంద గ్రంథాలను కూడా కోర్సులో చేర్చారు.
- Advertisement -



