ప్రజాస్వామ్య విలువలను నిర్వీర్యం చేసిన బీజేపీ
గ్రామ గ్రామాన ఓట్‌చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ : యూత్ కాంగ్రెస్ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఓట్‌చోరీతోనే మూడోసారి ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఓట్‌చోరీ జరిగిందంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిర్గతం చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏఐసీసీ ఆదేశాలమేరకు ప్రతి గ్రామంలో వందకుపైగా సంతకాల సేకరణ చేయాలని పిలుపునిచ్చారు. చోరీ జరిగిందంటూ తాను తొలి సంతకం పెడుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచారనీ, ఇప్పటివరకు వారు ఓటు చోరీపై మాట్లాడలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు అందులో భాగంగానే మూడు లక్షల ఓట్ల మోజార్టీ వచ్చిందేనన్నారు. దీనిపై రాహుల్‌గాంధీ సంధించిన ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓటుచోరీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులను కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, రాష్ట్ర ఇన్‌ఛార్జి సయ్యద్ ఖలీద్, కో ఇన్‌ఛార్జి రోష్ని కుశాల్, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్‌రెడ్డి, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ…ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఓట్‌చోరీతోనే మూడోసారి మోడీకి అధికారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES