– 9న జరిగే సమ్మెలో మహిళా కూలీలు పాల్గొనాలి :మహిళా కూలీల కన్వీనర్ బొప్పిని పద్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళలు తమ హక్కులను రోజురోజుకీ కోల్పోతున్నారనీ, వారి హక్కులను కాపాడటంలో మోడీ సర్కారు విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహిళా కూలీల కన్వీనర్ బొప్పిని పద్మ అన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే సమ్మెలో మహిళా కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహిళా కూలీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ..దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించడం వల్ల మహిళా కూలీలు తమ ఉపాధిని కోల్పోతున్నారని వాపోయారు. ప్రజాపంపిణీ, ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు. శ్రమజీవులకు కనీస వేతనాలు అందట్లేదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, నాయకులు స్వరాజ్యం, వెంకటరాజ్యం, స్వరూప, రత్తమ్మ, శివలీల, తదితరులు పాల్గొన్నారు.
మహిళల హక్కులను కాపాడటంలో మోడీ సర్కారు విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES