Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రజలను ఊహల్లో విహరింపజేస్తున్న మోడీ ప్రభుత్వం

ప్రజలను ఊహల్లో విహరింపజేస్తున్న మోడీ ప్రభుత్వం

- Advertisement -

విద్యా, వైద్యం, సమానత్వ పాలన అందించడంలో పూర్తిగా విఫలం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌

దేశంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఊహల్లో విహరింప చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యా, వైద్యం, సమానత్వ పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎట్లా గురువారెడ్డి విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని ప్రధాని మోడీ చెబుతున్నారని.. అవి అసంబద్ధమైన మాటలే తప్పా వాస్తవిక ఆధారాలు లేవన్నారు. కమ్యూనిస్టులను, మావోయిస్టులను అణచివేయడా నికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మావోయిస్టులపై కొనసాగుతున్న ధమనకాండను విరమించుకొని వారిని చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం దురదృష్టకరమని.. దానిపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యే సందర్భంలో కేసీఆర్‌, హరీశ్‌రావు.. హంగు ఆర్భాటాలతో, జనబలంతో హాజరు కావడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్‌ తానే చేశానని చెబుతుండే కేసీఆర్‌.. ఇప్పుడు తనకేమీ తెలియదనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజా నిజాలు ఏమిటో కమిషన్‌ తేలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పారదర్శకంగా కొనసాగాలని, తమ పార్టీ పథకాలుగా మార్చొద్దని తెలిపారు. సీపీఐ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో డిసెంబర్‌ 26వ తేదీన 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, నాయకులు లక్ష్మణ్‌, శంకర్‌, బన్సీలాల్‌, ఆరీఫ్‌, సత్యనారాయణ, మల్లేశం, చంద్రం, ప్రసన్నకుమార్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad