అగ్ర నేతల రాకతో బీజింగ్ బిజీ బిజీ
ఎస్‌సీఓ సదస్సు, సైనిక పరెేడ్‌కు సర్వం సిద్ధం
బీజింగ్ : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తియాంజిన్‌లోని బిన్హరు అంతర్జాతీయ విమా నాశ్రయంలో దిగారు. చైనా, భారత్ అధికారులు ఆయనకు కరచాలనాలతో సాదరపూర్వక స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు. మోడీ తన రెండు రోజుల చైనా పర్యటనలో భాగంగా ఎస్‌సీఓ సదస్సుకు హాజరు కావడంతో పాటు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. చైనా రావడానికి ముందు మోడీ జపాన్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. కాగా చైనాలో దిగిన వెంటనే మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘చైనాలోని తియాంజిన్‌లో దిగాను. ఎస్‌సీఓ సదస్సులో జరిగే చర్చలు, వివిధ దేశాల నేతలతో జరిపే సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు. మోడీ, జిన్‌పింగ్‌లు చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 23న రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. 2018 తర్వాత చైనాలో మోడీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
చైనాలో మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES