- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్‌లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. తొలి ప్రయివేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని తెలిపారు.
- Advertisement -



