Sunday, March 15, 2026
E-PAPER
Homeజాతీయందేశ ప్రజలను మోసం చేస్తున్న మోడీ

దేశ ప్రజలను మోసం చేస్తున్న మోడీ

- Advertisement -

ట్రంప్‌నకు లొంగిపోవడం సరికాదు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ధావలే
ఉత్సాహంగా సీపీఐ(ఎం) ”జన్‌ ఆక్రోశ్‌ జాతాలు”

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోడీ లొంగిపోవడం సరికాదనీ, ఈ విధానంతో దేశ ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ధావలే విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ”జన్‌ ఆక్రోశ్‌ జాతాలు” ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా బీహార్‌లోని దర్భంగా జిల్లాలో కొనసాగుతున్న జాతాలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే పాల్గొని మాట్లాడారు.

మోడీ ప్రభుత్వం తన విధానాలతో దేశాన్ని, ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఈ జాతా బీహార్‌లో ఐదు గ్రూపులుగా కొనసాగుతోంది.రాజస్థాన్‌లో జరిగిన జాతాలో రైతులు, కార్మికుల భారీగా పాల్గొన్నారు. ఉదయపూర్‌ జిల్లాలోని కోట్రా తాలూకాలో నాలుగు సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బృందాకరత్‌, తదితరులు హాజరయ్యారు. జాతాకు ప్రజలు తమ సమస్యలను వివరించారు. సమావేశం అనంతరం రాత్రి ‘జై భీమ్‌’ చిత్రాన్ని ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -