Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశ ప్రయోజనాలు మోడీ తాకట్టు

దేశ ప్రయోజనాలు మోడీ తాకట్టు

- Advertisement -

కార్మిక, కర్షకుల సమస్యలపై పోరాటాలు ఉధృతం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచ దేశాలపై అమెరికన్‌ సామ్రాజ్యవాద దాడి పెరుగుతున్నదని, అమెరికా సామ్రాజ్య వాదానికి తలొగ్గి దేశ ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతున్నాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో ఆయన మాట్లాడారు. సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా చుక్క రాములు మాట్లాడుతూ దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందన్నారు. మోడీ ఓ పక్క మతోన్మాదాన్ని మరోపక్క కార్పొరేట్‌ వ్యక్తులను అడ్డుపెట్టుకొని దేశంలో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, ఏ.మాణిక్‌, జి.సాయిలు, ఎం.నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -