అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ధనిక వర్గాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీ రామ్ జీ-2025 చట్టాన్ని తీసుకొచ్చిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలో ఆయన సౌహార్ధ సందేశాన్ని ఇచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను కార్మికవర్గంపై దాడిగా చూడాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీ జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం అంటే గ్రామీణ పేదలపై దాడి చేయడమేనని తెలిపారు.
అభివృద్ధి పేరుతో దేశవ్యాప్తంగా మోడీ సర్కారు బలవంతపు భూ సేకరణలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రామిక వర్గాల ఐక్యత అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మిక సంఘా నికి సీఐటీయూ తోడ్పాటును అంది స్తున్నదనీ, ఆ రకంగా ఐక్యంగా ఉద్య మాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కృషి ఎక్కువగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో మరింత ఐక్యతో వర్గపోరా టాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 12న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.



