నవతెలంగాణ-హైదరాబాద్: నకిలీ దగ్గు మందుల దందాపై సమాజ్ వాజ్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎం మోడీ పార్లమెంట్ నియోజకవర్గం వారణాసీ నుంచి సిరప్ మాఫియా దండా నిర్వహిస్తోందని, ఆ విషయంపై రాష్ట్ర సీఎం యోగి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లలలో దందా కొనసాగుతోందని, అంతర్జాయంగా పరంగా లింకులు ఉన్నాయని ఆరోపించారు. ఈ రాకెట్ దందాలో వందల కంపెనీలు వాటాలు కలిగి ఉన్నాయని, లక్షల కోట్లు చేతులు మారుతున్నాయని, బుల్డోజర్ తరహాలో ఈ మాఫియాను అంతం చేయాలని లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ కీలక విషయాలను దాచిపెట్టిందని , సమాజ్‌వాదీ పార్టీని నిందించడానికి బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేసిన చిత్రాలను ఉపయోగిస్తోందని అన్నారు. “ఒక చిత్రంలో నిలబడటం వల్ల ఎవరైనా మాఫియా అవుతారంటే, నా దగ్గర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అనేక మంది బీజేపీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు. తన ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కలిసి కనిపిస్తే, అప్పుడు ఎవరిని మాఫియా అని పిలుస్తారు?” అని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



