Thursday, July 31, 2025
E-PAPER
Homeకరీంనగర్బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోడీ పాలన

బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోడీ పాలన

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కులగనణ జరిగే వరకు రాహుల్ పోరాటం ఆగదు..
స్వాతంత్రం వచ్చినప్పుడే భారత్ సెక్యులర్ దేశం
కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ముస్లిం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగుతుందని, మోడీ పాలన ఆర్ఎస్ఎస్ కనుసనల్లో జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ చిత్రపటానికి 21 బిందెలతో పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులగనన జరిగే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆగదని స్వాతంత్రం వచ్చినప్పుడే భారత్ సెక్యులర్ దేశమని ఆయన పేర్కొన్నారు.18వ శతాబ్దంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని తపించిన మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఉద్యమిస్తున్నాడని అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి  బీసీ కులగనన జరగలేదని 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో  బీసీ కులగననకు ఉద్యమించడాన్ని  ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల బాధల్ని తెలుసుకోవడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగనన జరగాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి తీర్మానం పంపారని గుర్తు చేశారు. స్వాతంత్రం కోసం గాంధీ వెంట మౌలానా అబ్దుల్ లాంటివాళ్ళు ఎంతోమంది ఉన్నారని అప్పుడే అర్థమైంది ఈ దేశం సెక్యూలర్ దేశమని అందరూ కలిసి ఉండాలని కోరారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎక్కువ గెలవాలని బిజెపికి చిత్తశుద్ధి ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో బీసీ కులగలను జరపాలని  హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీ కులగనన కోసం ఆగస్టు 5 6 తేదీలలో జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడు ఢిల్లీకి రావాలని తాడోపేడో తేల్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, బోప్ప దేవయ్య,, చేపూరి జనార్ధన్, కోడం అమర్నాథ్, రాపల్లి కళ్యాణ్, గుండ్ల పెళ్లి గౌతమ్, అడ్డగట్ల శంకర్,   కల్లూరి చందన,ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, ఎదురుగట్ల వనిత,తస్మా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -