- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని స్పీచ్ ఉంటుందని పేర్కొంది. అయితే, ప్రధాని ఏ విషయంపై మాట్లాడతారనే దానిపై పీఎంవో స్పష్టత ఇవ్వలేదు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సస్పెన్స్ నెలకొంది.
- Advertisement -