– షబ్బీర్ అలీని కలిసి కృతజ్ఞతలు
– పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
నవతెలంగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా నియామకం పొందిన మహమ్మద్ ఘాజీ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నీ శుక్రవారం జిల్లా కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజీ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిబద్ధతతో సేవ చేస్తానని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మార్గదర్శకత్వంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిస్తామని, ప్రజలకు చేరువగా ఉండే విధంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు.
“నాకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కామారెడ్డి జిల్లా పురోగతికి అహర్నిశలు కృషి చేస్తాను” అని మహమ్మద్ ఘాజీ తెలిపారు.



