ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి
లేదంటే ఇంటిని ముట్టడిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ నేతల హెచ్చరిక
కరీంనగర్, హైదరాబాద్ ఓయూలో నిరసన
నవతెలంగాణ – కరీంనగర్/ఓయూ
”ఆంధ్రప్రదేశ్‌లోని మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి.. ఆయన వెంటనే విద్యార్థి సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేదంటే ఇంటిని ముట్టడిస్తాం..” అని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్చరించారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నిస్తుంటే, కిడ్నాప్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ నేతల కిడ్నాప్‌ను ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటు అన్నారు.
విద్యార్థుల నుంచి దాదాపు రూ.26కోట్లు అక్రమంగా వసూలు చేశారన్నారు. ఫీజుల దోపిడీ చేస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోందన్నారు. అలాగే, విద్యార్థి సంఘాలకు మోహన్‌బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోహన్‌బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శులు గట్టు ఆకాష్, భోగేశ్వర్, జిల్లా కమిటీ నాయకులు రత్నం సురేష్, సందేశ్, రాకేష్, అక్షరు, నాయకులు శ్రీశైలం, వరుణ్, విష్ణువర్ధన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో మోహన్‌బాబు చిత్రపటం దహనం
ఏపీలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను మోహన్‌బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఓయూలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సినీనటుడు మోహన్‌బాబు చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్ మమత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు యూనివర్సిటీల కు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుండటంతో.. అవి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటు న్నాయని విమర్శించారు.
పేద విద్యార్థుల తల్లి దండ్రుల రక్తాన్ని పీల్చుకుంటున్న మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాల న్నారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం స్పందించి, కిడ్నాప్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.27 కోట్లను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్‌బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి అజయ్, సహాయ కార్యదర్శి మనోజ్, అశ్విని, అశోక్, సాయి, స్పందన పాల్గొన్నారు.
మోహన్‌బాబు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



